‘అఖిల్’ సినిమా వాయిదా!

‘అఖిల్’ సినిమా వాయిదా!

Published on Oct 15, 2015 9:00 PM IST

akhil
‘అఖిల్’.. ప్రస్తుతం సగటు తెలుగు సినీ అభిమానిని ఎంతో ఆసక్తిగా ఎదురుచూయిస్తున్న సినిమా. అక్కినేని వంశం నుంచి మూడో తరంలో ఎంట్రీ ఇస్తోన్న అఖిల్ మొదటి సినిమా కావడంతో ఈ సీజన్‌లో ‘అఖిల్’ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. దసరా కానుకగా అక్టోబర్ 22కు ఫిక్స్ అయిన ఈ సినిమా తాజాగా కొన్ని సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. నిర్మాత నితిన్ ఇదే విషయాన్ని తెలియజేస్తూ.. “గ్రాఫిక్స్ పనుల్లో జాప్యం కారణంగా అఖిల్ సినిమాను అక్టోబర్ 22న విడుదల చేయలేకపోతున్నాం. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తాం” అని ట్వీట్ చేశారు.

దర్శకుడు వీవీ వినాయక్, నిర్మాత నితిన్ ఈ సినిమాను భారీ బడ్జెట్‍తో నిర్మించడమే కాకుండా, సినిమాకు ఈ స్థాయి క్రేజ్‌ను తీసుకురావడంలో కూడా బాగా సఫలమయ్యారు. కాగా అన్ని కుదిరి సినిమా దసరాకు పెద్ద ఎత్తున విడుదలవుతుందనుకుంటున్న తరుణంలో ఇలా అకస్మాత్తుగా వాయిదా పడడం అభిమానులను నిరుత్సాహపరుస్తోంది. ఇక దసరా పండుగ రోజున భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైన అఖిల్ చివరి నిమిషంలో వాయిదా పడడంతో ప్రస్తుతం దసరాకు ఏ సినిమా వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ‘కంచె’ సినిమా గానీ, ‘షేర్’ సినిమా గానీ దసరాకు విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు