అక్కినేని అఖిల్ ‘అఖిల్, హలో’ చిత్రాల తరువాత చేస్తోన్న మూడవ చిత్రం ‘మిస్టర్ మజ్ను’. ఈ చిత్రం ఫై అక్కినేని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.
‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్లో అఖిల్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది.
కాగా ఈ చిత్రం టైటిల్ సాంగ్ కు సంబంధించిన ఫోటోను ఈ రోజు విడుదల చేసింది చిత్రబృందం. క్రిస్మస్ సందర్భంగా రేపు సాయంత్రం ఆరు గంటలకు సాంగ్ ను విడుదల చేయబోతున్నారు. అయితే విడుదలైన సాంగ్ కు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్విసిసి పతాకం ఫై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. .
మరి ఈ చిత్రంతో అఖిల్ మొదటి బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి. అయితే అఖిల్ మాత్రం ఈ చిత్రం ఫై ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు. ఇక ఈ సినిమా టీజర్ ఈ నెల 25న విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
Worked really hard for this ! 3 months of hell and heaven I guess ! A big shout out to my trainer Dillip ! Couldn’t have done it without you! Totally worth it !!! #MrMajnu pic.twitter.com/us6nnVkJYl
— Akhil Akkineni (@AkhilAkkineni8) December 24, 2018


