అఖిల్ కి అమ్మగా మరో సారి ఆ సీనియర్ హీరోయిన్

Published on Jun 13, 2019 3:30 am IST

అక్కినేని వారసుడు అఖిల్ తన నాల్గవ మూవీ గా క్లాస్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల గ్రాండ్ గా ఈ మూవీ ప్రారంభోత్సవ వేడుక కూడా నిర్వహించడం జరిగింది.ఐతే సీనియర్ హీరోయిన్ ఆమని అఖిల్ కి అమ్మగా నటించనున్నార సమాచారం. అప్పుడెప్పుడో ఇంగ్లీష్ మూవీ “బేబీస్ డే అవుట్” కి రీమేక్ గా తెరకెక్కిన ‘సిసింద్రీ’ మూవీలో నటించిన చంటిపాపైన అఖిల్ కి ఆమని అమ్మగా నటించిన విషయం తెలిసిందే.

మళ్ళీ ఇన్నేళ్ల తరువాత వీరిద్దరు తల్లీ కొడుకులుగా కనిపించడంతో ఈ వార్త ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ మూవీలో అఖిల్ సరసన హీరోయిన్ ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు. రష్మిక లేదా కియారా అద్వానీ పేర్లు పరిశీలన లో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకెళ్లనుంది.

సంబంధిత సమాచారం :

More