థాయ్ ల్యాండ్ తర్వాత సౌత్ ఆఫ్రికా వెళ్లనున్న అఖిల్

akhil
‘మనం’ సినిమా చివర్లో ఒక్క రెండు నిమిషాలు కనిపించి తెలుగు ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్నాడు యంగ్ హీరో అక్కినేని అఖిల్. అప్పటి నుంచి ప్రేక్షకులు, అక్కినేని అభిమానులు అఖిల్ మొదటి సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ రిలీజ్ చేసిన రెండు మేకింగ్ వీడియోస్ ద్వారా ఆ అంచనాలను మరింత పెంచేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ థాయ్ ల్యాండ్ లో జరుగుతోంది. అక్కడ ఓ యాక్షన్ ఎపిసోడ్ తో పాటు అఖిల్ – బ్రహ్మానందం ఇతర తారాగణంపై వచ్చే కొన్ని సీన్స్ ని షూట్ చేస్తున్నారు. ఈ నెలాఖరు లోపు ఈ షెడ్యూల్ పూర్తవుతుంది.

ఈ షెడ్యూల్ తర్వాత ఈ చిత్ర టీం తదుపరి అవుట్ డోర్ షెడ్యూల్ కోసం సౌత్ ఆఫ్రికా వెళ్లనున్నారు. జూలై మొదటి వారం నుంచి ఈ షెడ్యూల్ మొదలవుతుంది. ఆ షెడ్యూల్ లో కొన్ని సీన్స్ తో పాటు సాంగ్స్ ని కూడా షూట్ చేయనున్నారు. ఇప్పటి వరకూ షూట్ చేయని కొన్ని సౌత్ ఆఫ్రికా లొకేషన్స్ లో ఈ సినిమా సాంగ్స్ షూట్ చేయనున్నారు. మాస్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ ని విపరీతంగా ఎంటర్టైన్ చేసే వివి వినాయక్ ఈ సినిమాకి డైరెక్టర్. అఖిల్ తో పాటు బాలీవుడ్ భామ సయేషా సైగల్ ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం కానుంది.

అఖిల్ మొదటి సినిమాని శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై యంగ్ హీరో నితిన్ నిర్మిస్తున్నాడు. అఖిల్ మొదటి సినిమా విషయంలో ఎలాంటి ఛాన్స్ తీసుకోకూడదని నితిన్ దగ్గరుండి మరీ ప్రొడక్షన్ వాల్యూస్ ని చూసుకుంటున్నాడు. వెలిగొండ శ్రీనివాస్ కథని అందించిన ఈ సినిమాకి కోన వెంకట్ డైలాగ్స్ రాస్తున్నాడు. అనూప్ రూబెన్స్ – ఎస్ఎస్ తమన్ కలిసి ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు.

Exit mobile version