అఖిల్ కి హీరోయిన్ కావాలి !

అఖిల్ కి హీరోయిన్ కావాలి !

Published on Apr 29, 2019 12:04 AM IST

‘మిస్టర్ మజ్ను’ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది అక్కినేని అఖిల్ కి. దాంతో తన తరువాత సినిమా పై మరింత జాగ్రత్త పడుతున్నాడు అఖిల్. తన తర్వాత సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా, భాస్కర్ బొమ్మరిల్లు సినిమాలో లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు లవ్ స్టోరీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందట.

అయితే అఖిల్ కి హీరోయిన్ సెట్ కావట్లేదు. కియరా అద్వానీ ని హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నా.. ఆమె డేట్స్ ఎడ్జిస్ట్ కాలేదు. తాజాగా రష్మికా మండన్నను హీరోయిన్ గా తీసుకోనున్నారని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఫైనల్ కాలేదు. మొత్తానికి అఖిల్ కి హీరోయిన్ కావాలి అన్న పాయింట్ దగ్గరే ఉంది మ్యాటర్.

ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నే నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా మే రెండవ వారం నుండి సెట్స్ మీదకు వెళ్లనుందని వార్తలు వస్తున్నాయి. మరి భాస్కర్ తో చెయ్యబోయే సినిమాతోనైనా అఖిల్ భారీ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు