
అక్కినేని కుటుంబం నుంచి ఎఎన్ఆర్, నాగార్జున ల తర్వాత మూడవతరం హీరోస్ లో ఒకడుగా తెలుగు తెరకు పరిచయం కావడానికి సిద్దమైన హీరో అఖిల్ అక్కినేని. అన్నీ అనుకున్నట్టుగా జరిగి ఉంటే అఖిల్ మొదటి సినిమా ‘అఖిల్’ దసరా కానుకగా రిలీజ్ అయ్యి ఉండాలి. కానీ విఎఫ్ఎక్స్ విషయంలో ఈ చిత్ర టీం పూర్తి సంతృప్తికరంగా లేకపోవడం వలన సినిమాని వాయిదావేసారు. వాయిదా అన్న సమయం నుంచి అఖిల్ పై రీ షూట్ జరుగుతుందని, సినిమా క్రిస్మస్ కి వస్తుందనే పలు రకాల ప్రచారాలు జరిగాయి. కానీ అవన్నీ నిజం కాదని, విఎఫ్ ఎక్స్ వర్క్ ఫైనల్ స్టేజ్ లోఉందని త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని అఖిల్ నిన్ననే క్లారిటీ ఇచ్చాడు.
దాంతో అఖిల్ సినిమా రిలీజ్ విషయంపై ఈ చిత్ర టీం ని అప్రోచ్ అయితే మళ్ళీ డిజైన్ చేస్తున్న విఎఫ్ఎక్స్ వర్క్ చివరి దశకు చేరుకుంది. అవుట్ పుట్ కూడా బాగా వస్తోంది, మరో 5 రోజుల్లో ఆ వర్క్ మొత్తం పూర్తవుతుంది. అది అయ్యాక ఫైనల్ గా ఓకే అనుకుంటే అఖిల్ సినిమాని దీపావళి కానుకగా నవంబర్ 11నే రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్లు వారు తెలిపారు. అఖిల్ కూడా అనుకున్న టైంకి వర్క్ ని ఫినిష్ చేసి ఏ మాత్రం ఆలస్యం లేకుండా దీపావళికే సినిమాని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.
వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అఖిల్ సరసన సయేషా సైగల్ హీరోయిన్ గా కనిపించనుంది. నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ – తమన్ కలిసి మ్యూజిక్ అందిస్తే మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు.

