అఖిల్ 4 ఫై క్లారిటీ వచ్చింది !

Published on Jan 31, 2019 9:54 am IST

యువ హీరో అక్కినేని అఖిల్ , శ్రీను వైట్ల దర్శకత్వంలో తన నాల్గవ చిత్రాన్ని చేయనున్నాడని నిన్న ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ వార్తలతో అఖిల్ అభిమానులు ఒక్కింత నిరాశకు గురైయ్యారు. ఎందుకంటె గత కొంత కాలంగా శ్రీను వైట్ల వరస పరాజయలతో రేస్ లో చాలా వెనుకబడిపోయారు. దాంతో మళ్ళీ ఇప్పుడు అఖిల్ తో సినిమా అనే సరికి అభిమానులు కంగారు పడ్డారు. అయితే తాజాగా ఈ వార్తలు ఫేక్ అని తేలిపోయింది. ఇక అఖిల్ కి కూడా ఈ టైం లో ఒక భారీ హిట్ అవసరం.

అయితే అఖిల్ ఈసారి కూడా స్టార్ డైరెక్టర్ తో కాకుండా మళ్ళీ ఒక యంగ్ డైరెక్టర్ కి అవకాశం ఇస్తున్నాడు. ‘మలుపు’ ఫేమ్ సత్య తో అఖిల్ నాల్గవ చిత్రాన్ని చేయనున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈచిత్రం మార్చి నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. మరి అఖిల్ ఈచిత్రం తోనైనా తన ఛాయస్ కరెక్ట్ అని నిరూపిస్తాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :