అఖిల్ నైజాం కలెక్షన్స్ రిపోర్ట్

అఖిల్ నైజాం కలెక్షన్స్ రిపోర్ట్

Published on Nov 13, 2015 7:51 PM IST

akhil6
‘అఖిల్’.. సగటు తెలుగు సినీ అభిమానిని గత కొంతకాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేలా చేసిన సినిమా. అక్కినేని వంశంలో మూడో తరం నుంచి అక్కినేని అఖిల్‌ను పరిచయం చేస్తూ రూపొందిన ఈ సినిమా టాలీవుడ్‌లో ఈ సీజన్ అత్యంత క్రేజ్ ఉన్న సినిమాగా నిలబడింది. వీవీ వినాయక్ దర్శకత్వంలో, నితిన్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైంది. అక్కినేని వంశంలో పూర్తి స్థాయి మాస్ హీరో అనిపించుకోదగ్గ క్వాలిటీస్ ఉన్న నటుడిగా అఖిల్‌పై మొదట్నుంచీ విపరీతమైన ప్రచారం జరుగుతూ వచ్చింది.

కాగా ఈ నేపథ్యంలోనే ఈ సినిమా మొదటిరోజు భారీ వసూళ్ళను రాబట్టి సినిమాపై ఉన్న క్రేజ్‌ను మరోసారి స్పష్టం చేసింది. అయితే సినిమాకు మొదటిరోజు ప్రేక్షకులు, విమర్శకుల దగ్గర్నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ రావడంతో రెండో రోజు ఈ సినిమా కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. నైజాం ఏరియాలో చూసుకుంటే మొదటి రోజు సుమారు 2.35 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసిన ఈ సినిమా, రెండో రోజు కోటి రూపాయల వరకూ వసూలు చేసింది. ఇక నిన్న సెలవు దినం కాకపోవడంతో కలెక్షన్స్ సాధారణంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శని, ఆది వారాల్లో దీపావళి వీకెండ్ ఈ సినిమాకు బాగా కలిసి వచ్చే అంశమని, ఆ రెండు రోజుల్లో ఈ సినిమా మంచి కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అభిప్రాయం.

తాజా వార్తలు