ప్యాచ్ వర్క్ ప్లాన్ చేస్తోన్న ‘బ్యాచ్‌ల‌ర్’

ప్యాచ్ వర్క్ ప్లాన్ చేస్తోన్న ‘బ్యాచ్‌ల‌ర్’

Published on May 2, 2021 7:00 PM IST

అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక ఫోర్ డేస్ ప్యాచ్ వర్క్ ఉందట. అన్ని కుదిరితే ఈ నెల 7 నుండి అఖిల్ పై సోలో షాట్స్ తీయనున్నారు. ఇక కరోనా సెకెండ్ వేవ్ తగ్గిన తరువాత ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు.

ఇక ఈ సినిమాలో లవ్ ట్రాక్ చాల బాగా వచ్చిందని.. ముఖ్యంగా లవ్ సీన్స్ లో అఖిల్ – పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాల బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ కూడా సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని తెలుస్తోంది. కాగా అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాను బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫలితం పై అఖిల్ తో పాటు బొమ్మరిల్లు భాస్కర్ కూడా బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. ఫ్యాన్స్ సైతం అఖిల్ ఈ చిత్రంతోనైనా సాలిడ్ హిట్ అందుకోవాలని కోరుకుంటున్నారు. ఈ సినిమా అఖిల్ కెరీర్ కి కీలకం కానుంది. మరి అఖిల్ కి ఎలాంటి హిట్ వస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు