నెల రోజుల ముందునుంచే ‘అఖిల్’ ప్రమోషన్స్!

నెల రోజుల ముందునుంచే ‘అఖిల్’ ప్రమోషన్స్!

Published on Sep 23, 2015 4:18 PM IST

akhil
అక్కినేని వంశం నుంచి మూడో తరంలో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన అఖిల్, ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అఖిల్ మొదటి సినిమా టైటిల్ కూడా ‘అఖిల్’ కావడంతో ఈ పేరు అంతటా మారుమోగిపోతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అఖిల్ ఎంట్రీ సినిమా అనగానే మొదట్నుంచీ కనిపిస్తూ వచ్చిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని నిర్మాత నితిన్ ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించారు.

ఇక ఈమధ్యే ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుక కూడా పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఆడియో రిలీజ్ రోజునుంచే ఈ సినిమా ప్రమోషన్స్ కూడా పెద్ద ఎత్తున ప్లాన్ చేయడం విశేషంగా కనిపిస్తోంది. రేపట్నుంచి (సెప్టెంబర్ 24) అఖిల్ స్వయంగా సినిమా ప్రమోషన్స్‌లో భాగం కానున్నారు. అక్టోబర్ 22న దసరా కానుకగా విడుదలవుతోన్న ఈ సినిమాకు నెలరోజుల ముందునుంచే సినిమా యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టడం ఆసక్తికరంగా మారింది. అఖిల్ రేపు ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా అమెరికా వెళ్ళనున్నారని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు