ఫాలోయింగ్ లో పవన్ ని తలపిస్తున్న అఖీరా

Published on Apr 8, 2020 3:54 pm IST

బర్త్ డే బాయ్ అఖీరా నేడు 16వ ఏట అడుగుపెట్టారు. పవన్ కళ్యాణ్- రేణు దేశాయ్ ల కుమారుడు అఖీరా 2004 ఏప్రిల్ 8న జన్మించాడు. ఐతే ఈ టీనేజ్ కుర్రాడు అప్పుడే సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేశాడు. నేటి మార్నింగ్ చాల సేపు అఖీరా బర్త్ డే ట్యాగ్ ట్విట్టర్ లో టాప్ ట్రెండింగి లో కొనసాగింది. అఖీరా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి కూడా పోటీ ఇచ్చాడు. వీరిద్దరి బర్త్ డే యాష్ ట్యాగ్స్ చాల సమయం టాప్ ట్రెండింగ్ కోసం పోటీపడ్డాయి. అఖీరా ఇంకా వెండి తెర ఎంట్రీ ఇవ్వకుండానే ఈ రేంజ్ లో పాపులారిటీ కలిగివుండం అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తుంది.

కేవలం పవన్ కళ్యాణ్ కుమారుడు, మెగా వారసుడు అనే బ్రాండ్ ఇమేజ్ అఖీరాకు ఇంత ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ఇక నేడు మెగాస్టార్ చిరంజీవి అఖీరా కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అఖీరా పెద్ద స్టార్ హీరో కావాలని పరోక్షంగా కోరుకున్నారు. చిరు అఖీరా చిన్నప్పటి ఫోటో పంచుకోవడం విశేషత సంతరించుకుంది. ఐతే పవన్ కళ్యాణ్ అఖీరాకు సోషల్ మీడియా వేదికగా విషెష్ చెప్పలేదు. ఆయన స్వయంగా ఫోన్ లో అఖీరాకు బెస్ట్ విషెస్ చెప్పినట్లు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :

X
More