ఏజెంట్: దర్శకుడితో అక్కినేని అఖిల్ కూల్ డిస్కషన్..!

Published on Aug 14, 2021 11:00 pm IST

అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో “ఏజెంట్” సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అఖిల్ మాస్ లుక్ తో కొత్తగా మేకోవర్ అయ్యాడు. సిక్స్ ప్యాక్ బాడీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. రామబ్రహ్మ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై కూడా రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి.

అయితే తాజాగా దర్శకుడు సురేందర్ రెడ్డి, అక్కినేని అఖిల్ ఇద్దరు ఓ పీస్ ఫుల్ ప్లేస్‌లో కూల్ మూడ్‌లో కూర్చుని “ఏజెంట్” సినిమాకి సంబంధించి ఏవో డిస్కషన్స్ చేసుకుంటున్నారు. ఈ ఫోటోలను అఖిల్ తన ఇన్‌స్టా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ కూల్ డిస్కషన్స్ ఫోటోలు అఖిల్ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే అక్కినేని అఖిల్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కి రెడీగా ఉంది.

సంబంధిత సమాచారం :