7 మిలియన్ ఫ్యామిలీ తో అక్కినేని యంగ్ హీరో.!

Published on Mar 22, 2022 1:00 pm IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి మంచి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో అక్కినేని కుటుంబం హీరో అక్కినేని నాగ చైతన్య కూడా ఒకడు. అయితే నాగ చైతన్య ఒక ఫైనెస్ట్ యాక్టర్ గా మన టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్నాడు. మరి ఇప్పుడు మళ్ళీ కెరీర్ లో బౌన్స్ బ్యాక్ అయ్యి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న చైతు ఇపుడు లేటెస్ట్ గా తన సోషల్ మీడియాలో 7 మిలియన్ ఫ్యామిలీ కి చేరుకున్నాడు.

ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్ లో ఈ మైల్ స్టోన్ ని తాను టచ్ చేసాడు. మరి అలాగే మన టాలీవుడ్ హీరోస్ లో 7 మిలియన్ ఫాలోవర్స్ కలిగిన అతి తక్కువమంది సెలెబ్రెటీస్ లో తాను ఇప్పుడు ఒకడిగా నిలిచాడు. మరి ఇదిలా ఉండగా ప్రస్తుతం చైతూ “థ్యాంక్ యూ” సినిమా మరియు బాలీవుడ్ లో “లాల్ సింగ్ చద్దా” మరియు ఓ వెబ్ సిరీస్ ని చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :