ఆఅకౌంట్ ఫేక్….,అభిమానులకు నాగ్ క్లారిటీ

Published on Jun 15, 2019 2:40 pm IST

కింగ్ నాగార్జున ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం “మన్మధుడు 2” రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ మూవీ టీజర్ కి విశేష స్పందన వస్తుంది. ఇప్పటికే ఈ టీజర్ 8 మిలియన్ వ్యూస్ కి చేరుకుందని సమాచారం. నటుడు రాహుల్ రవీంద్ర దర్శకుడుగా మారి ఈ చిత్రం తెరకెక్కిస్తున్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ మూవీపై ప్రేక్షకులలో అంచనాలు బాగానే ఉన్నాయి.

ఐతే నాగార్జున సోషల్ మాధ్యమాల్లో మరీ అంత యాక్టీవ్ గా ఉండరు.కొంత కాలంగా ‘ఐయామ్ నాగార్జున’ పేరుతో ఇంస్టాగ్రామ్ లో ఒక అకౌంట్ నాగార్జున అధికారిక అకౌంట్ గా చలామణి కావడంతో చాలామంది నాగ్ అభిమానులు దానిని ఫాలో అవుతున్నారు. ఈవిషయం నాగార్జునకు తెలియడంతో, తన అధికారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్ గా చలామణి అవుతున్న ‘ఐయామ్ నాగార్జున’ అనే అకౌంట్ తనది కాదని, ఆయన తన అభిమానులకు ఓ క్లారిటీ ఇచ్చారు. దానితో పాటు నాకు ఎటువంటి ఇంస్టాగ్రామ్ అకౌంట్ లేదని చెప్పిన నాగార్జున, ఒకవేళ నేను అకౌంట్ తెరిస్తే మీకు తెలియజేస్తాను,అని అన్నారు.

https://twitter.com/iamnagarjuna/status/1139769841055698945

సంబంధిత సమాచారం :

More