విద్యాబాలన్ విషయంలో అక్షయ్ ఫన్నీ సెటైర్

Published on Jul 20, 2019 9:57 am IST

భారత్ అంతరిక్ష సంస్థ ఇస్రో సాధించిన అతిపెద్ద విజయాలలో మంగళ్ యాన్ ఒకటి, మనకు సమీపాన గల మార్స్ గ్రాహం పై పరిశోధకు గాను “మంగళ్ యాన్” పేరుతో ఓ ఉపగ్రహాన్ని ఇస్త్రో ప్రయోగించడం జరిగింది. మార్స్ కక్ష్యలో ఉపగ్రహం ప్రయోగించడానికి అగ్ర దేశాలైన అమెరికా,రష్యాలు సైతం మొదటి ప్రయత్నంలో విఫలం కాగా భారత్ విజయం సాధించి అంతరిక్ష పరిశోధనలలో అగ్రదేశాల సరసన చేరింది. ఐతే ఇప్పుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో “మిషన్ మంగళ్” పేరుతో ఈ చారిత్రాత్మక ప్రయోగంపై చిత్రం చేయడం జరిగింది. ఈ మూవీ స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా విడుదల కానుంది.

ఐతే ఈ మూవీ ట్రైలర్‌ ఆవిష్కరణ సందర్భంగా విలేకరుల సమావేశంలో అక్షయ్ కుమార్,విద్యాబాలన్ పాల్గొనగా ఓ విలేకరి విద్యా బాలన్‌ను ఆసక్తికర ప్రశ్న అడిగారు. ఈ సినిమాకుగాను జాతీయ అవార్డు వస్తుందని భావిస్తున్నారా? అని ప్రశ్నించారు.అవార్డుల గురించి నేను సినిమాలలో నటించను అని ఆమె చెప్పగా, దీనికి వెంటనే అక్షయ్‌ కలగజేసుకుంటూ.. తను అబద్ధం చెవుతున్నారు, ‘ఈమె పుట్టగానే.. జాతీయ అవార్డు వచ్చిందంటూ కుటుంబసభ్యులకు నర్సు శుభాకాంక్షలు చెప్పింది’ అంటూ అక్షయ్‌ సెటైరికల్ ఆన్సర్ ఇవ్వడంతో అక్కడ అందరూ గట్టిగా నవ్వారట.

నిత్యా మీనన్,తాప్సి పన్ను,సోనాక్షి సిన్హా వంటి తారలు ప్రధాన పాత్రలలో నటించగా,జగన్ శక్తి దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :