వైరల్: అక్షయ్ కుమార్‌తో మోహన్‌లాల్ డాన్స్!

Published on Feb 10, 2023 9:00 pm IST


మోహన్‌లాల్ మరియు హీరో అక్షయ్ కుమార్ దేశంలోని అతిపెద్ద స్టార్లు అనడం లో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇటీవల వీరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడకపోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఈరోజు ఇద్దరు స్టార్ హీరోల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో రాజస్థాన్‌లో గౌతమ్ మాధవన్ పెళ్లిలో మోహన్‌లాల్ మరియు అక్షయ్ కుమార్ కలిసి డ్యాన్స్ చేస్తున్నారు.

అక్షయ్ కుమార్ తన సోషల్ మీడియా లో ఈ వీడియోను షేర్ చేశారు. అంతేకాక ఈ అందమైన క్షణాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటానని పేర్కొన్నాడు. ఈ ఇద్దరు స్టార్ హీరోలు స్నేహపూర్వకం గా ఉండటం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్క్ ఫ్రంట్‌లో, అక్షయ్ తదుపరి సెల్ఫీలో కనిపించనున్నారు, ఇది ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు, మోహన్‌లాల్‌కు రామ్ పార్ట్ 1, మలైకోట్టై వాలిభన్, మరియు బరోజ్ ది గార్డియన్ ఆఫ్ డిగామాస్ ట్రెజర్ వంటి చిత్రాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :