హౌస్ ఫుల్ 5 కూడా అంటున్న అక్షయ్ కుమార్

Published on Nov 25, 2019 9:03 pm IST

దేశంలోనే ఏ స్టార్ హీరో చేయనన్ని సినిమాలు అక్షయ్ కుమార్ ఒక ఏడాది చేస్తారు. గత ఏడాది ప్యాడ్ మాన్, 2.0, గోల్డ్ చిత్రాలలో నటించిన ఆయన ఈ ఏడాది ఏకంగా నాలుగు సినిమాలు విడుదల చేయనున్నాడు. ఇప్పటికే కేసరి, మిషన్ మంగళ్, హౌస్ ఫుల్4 చిత్రాలు విడుదల కాగా డిసెంబర్ 27న గుడ్ న్యూస్ మూవీ విడుదల కానుంది. కాగా హౌస్ ఫుల్ సిరీస్ లో ఐదవ చిత్రం కూడా అక్షయ్ చేయనున్నారట. ఈమేరకు ఆయన ట్వీట్ చేయడం జరిగింది.

హౌస్ ఫుల్ 4 నెగెటివ్ రివ్యూల తో మొదలై కూడా రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అక్షయ్ కుమార్ తో పాటు రితేష్ దేశ్ ముఖ్, బాబీ డియోల్, కృతి సనన్, కృతి కర్బంద, పూజా హెగ్డే నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ బాగానే ప్రేక్షకులను మెప్పించింది. దీంతో ఈ సిరీస్ లో ఐదవ భాగాన్ని కూడా తెరకెక్కించనున్నట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పష్టత ఇచ్చారు. 2010లో మొదటి సారిగా హౌస్ ఫుల్ మూవీ రావడం జరిగింది. మొదటి భాగానికి సాజిద్ ఖాన్ దర్శకత్వం వహించగా అక్షయ్, రితేష్,జియా ఖాన్,అర్జున్ రాంపాల్, దీపికా, లారా దత్త నటించారు.

సంబంధిత సమాచారం :