స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరో అరుదైన గౌరవం అందుకున్నారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకున్నారు. గత ఏడాది ఆయన పాడ్ మాన్ అనే సోషల్ కాన్సెప్ట్ తో ఒక చిత్రం చేయడం జరిగింది. ఆడవారు రుతుస్త్రావం సమయంలో పడే ఇబ్బందులకు పరిష్కారంగా తక్కువ ధరలో నాప్కిన్స్ తయారీ విధానం రూపొందించిన అరుణాచలం మురుగనాథన్ అనే వ్యక్తి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇలాంటి సామజిక స్పృహ కలిగిన సినిమాలో నటించినందుకు అక్షయ్ కుమార్ ని భారత ప్రభుత్వం జాతీయ అవార్డుతో సత్కరించింది.
దర్శకుడు ఆర్ బాల్కి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 2017 కూడా టాయిలెట్ అనే సోషల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రంలో ఆయన నటించారు. ఇక అక్షయ్ లేటెస్ట్ మూవీ గుడ్ న్యూస్ ఈనెల 27న విడుదల కానుంది. కరీనా కపూర్, కియారా అద్వానీ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు రాజ్ మెహతా కామెడీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు.


