మన తెలుగు సినిమా గర్వించదగ్గ అతికొద్ది మంది దిగ్గజ హీరోస్ లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. మరి చిరంజీవి హీరోగా తెలుగు సినిమాకి అలాగే ఇండియన్ సినిమాకి కూడా ఎంతో చేశారు. ట్రెండ్ కి తగ్గట్టుగా తన నుంచి చేసిన ఫైట్లు, డాన్స్ లు లాంటివి ఇండియన్ సినిమా దగ్గర ఎంతోమందికి ప్రేరణగా నిలిచాయి.
ఇలా తెలుగులో ఎన్నెన్నో కొత్త ప్రయత్నాలు చేసి ఇండియన్ సినిమాని తన వైపు తిరిగేలా తాను చేశారు. అయితే తనపై లేటెస్ట్ గా బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. తెలుగు సినిమాకి చిరంజీవి గారు డాన్స్, డిసిప్లిన్ అలాగే హీరోయిజం వంటివి ఆయనే తీసుకొచ్చారు అని అక్షయ్ లేటెస్ట్ వేవ్స్ సమిట్ లో చెప్పడం జరిగింది. దీనితో తన కామెంట్స్ మెగాస్టార్ పై వైరల్ గా మారాయి.


