వందల కోట్ల ఆదాయం ఉన్న స్టార్ హీరో 8వేలకోసం…!

Published on Jul 17, 2019 4:05 pm IST

బాలీవుడ్ స్టార్ హీరోలలో అక్షయ్ కుమార్ తీరేవేరు. సంవత్సరానికి మూడు చిత్రాలకు పైనే విడుదల చేసే ఈయన స్పీడ్ యంగ్ హీరోలు సైతం అందుకోలేకపోతున్నారు. యాభై పదుల వయసులో కూడా అక్షయ్ ఫిట్నెస్ అమోఘం అని చెప్పాలి. కాగా విహారం యాత్రకు భార్య ట్వింకిల్ ఖన్నా తో లండన్ వెళ్లిన అక్షయ్ కుమార్ అక్కడ ఓ సరదా గేమ్ లో పాల్గొని అందరిని ఆశ్చర్యపరిచారు.

లండన్ వీధులలో చక్కర్లు కొడుతున్న ఈ జంటకి ఓ ఛాలెంజ్ కనిపించిందంట. అదేమిటంటే ఓ ఇనుప రాడ్ పట్టుకొని ఎక్కువసేపు వేలాడిన వారికి 100 పౌండ్లు బహుమతి అని రాసిఉండట. అది చూసిన అక్షయ్ కుమార్ సరదాగా కాసేపు ఆ ఇనుప రాడ్ పట్టుకొని వేలాడి తన సరదా తీర్చుకున్నాడు. ఆ సన్నివేశాన్ని వీడియో తీసిన ట్వింకిల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడమే కాకుండా వందల కోట్ల సంపాదిస్తూ ఫోర్బ్స్ జాబితాలో చేరిన ఈయన 100 పౌండ్లు కూడా వదలడం లేదు అన్నట్లుగా కామెంట్ పెట్టారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మాధ్యమాలలో వైరల్ గా మారింది.

ఇటీవల ఫోర్బ్స్ విడుదల చేసిన అత్యధికంగా సంపాదిస్తున్న ప్రపంచ సెలెబ్రిటీల జాబితాలో 444కోట్ల సంపాదనతో అక్షయ్ వరల్డ్ లో 35వ ర్యాంక్ లో నిలిచారు. ప్రస్తుతం అక్షయ్ నటిస్తున్న మిషన్ మంగళ్ విడుదలకు సిద్ధం కాగా, సూర్యవంశీ,కాంచన రీమేక్ సెట్స్ పై ఉన్నాయి.

సంబంధిత సమాచారం :