జాకీ చాన్ ను కూడా మించిపోయిన అక్షయ్.

Published on Aug 22, 2019 8:08 pm IST

బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ అత్యధిక సంపాదనక కలిగిన నటుల్లో ప్రపంచంలోనే నాలుగవ స్థానంలో నిలిచి అందరిని ఆశ్చర్యపరిచారు. 2019కిగాను అమెరికన్‌ బిజినెస్‌ మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌ అత్యధిక పారితోషకం ఆర్జిస్తున్న నటుల జాబితాను ప్రకటించింది. హాలీవుడ్‌ నటుడు డ్వేన్‌ జాన్సన్‌ తొలి స్థానంలో నిలవగా అక్షయ్‌ నాలుగో స్థానంలో చోటు దక్కించుకున్నారు. 2018 జూన్‌ 1 నుంచి 2019 జూన్‌ 1 వరకూ డ్వేన్‌ 89 మిలియన్‌ డాలర్లు సంపాదించినట్లు ఫోర్బ్స్‌ తెలిపింది. మరో ఆస్ట్రేలియన్‌ నటుడు క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ రెండో స్థానం దక్కించుకున్నారు. ఈ జాబితాలో భారత దేశం నుండి కేవలం ఒక్క అక్షయ్ కుమార్ కి మాత్రమే చోటు దక్కడం విశేషం.

బాలీవుడ్ లో అక్షయ్ కి మించి పారితోషికం తీసుకొనే సల్మాన్, రణ్వీర్ సింగ్ స్టార్స్ ఉన్నప్పటికీ, వారు కేవలం ఏడాదికి ఒకటి లేదా రెండు చిత్రాలు మాత్రమే చేస్తారు. అక్షయ్ మాత్రం మూడు నుండి నాలుగు చిత్రాలు విడుదల చేస్తాడు. మరో విశేషం ఏమిటంటే అక్షయ్ జాకీ చాన్ కంటే ఒక ర్యాంకు ముందున్నారు. మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన స్టార్స్….

1. డ్వేన్‌ జాన్సన్‌ – 89.4 మిలియన్ డాలర్లు
2. క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ – 76.4 మిలియన్‌ డాలర్లు
3. రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ – 66 మిలియన్‌ డాలర్లు
4. అక్షయ్‌ కుమార్‌ – 65 మిలియన్‌ డాలర్లు
5. జాకీ చాన్‌ – 58 మిలియన్‌ డాలర్లు

సంబంధిత సమాచారం :