ఈ దేశాల థియేటర్స్ లో పేలనున్న “లక్ష్మీ బాంబ్”.!

Published on Sep 30, 2020 5:20 pm IST

ఈ ఏడాది ఒక్క సారిగా వచ్చిన చేంజెస్ తో ప్రపంచ సినీ పరిశ్రమలోనే ఎన్నడూ లేని విధంగా పెను మార్పులు సంభవించాయి. దీనితో స్ట్రీమింగ్ రంగానికి ప్రాధాన్యత ఎంతగానో పెరిగిపోయింది. ఇదిలా ఉండగా ఈ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లోనే అప్పటికే షూట్ ను పూర్తి చేసుకున్న ఎన్నో చిత్రాలు నేరుగా విడుదల కావడం మొదలయ్యింది. ముఖ్యంగా మన దేశంలో అయితే ఈ సంప్రదాయం మరింత స్థాయిలో ఊపందుకుంది.

అయితే మన దక్షిణాదిలో భారీ చిత్రాలు తక్కువే కానీ బాలీవుడ్ లో మాత్రం భారీ చిత్రాలు ఎక్కువగానే ఉన్నాయి. అలా ఓటిటిలో రిలీజ్ కు రెడీ అయ్యిన మోస్ట్ అవైటెడ్ చిత్రం “లక్ష్మీ బాంబ్”. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం భారీ అంచనాలను నెలకొల్పుకుంది.

తమిళ్ లో తీసిన బ్లాక్ బస్టర్ హిట్ “కాంచన” చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వచ్చే నవంబర్ 9న దీపావళి కానుకగా రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇపుడు ఇదే కాకుండా న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా సహా యునైటెడ్ అరబ్ దేశాలలో కూడా ఈ చిత్రం అదే తేదీన థియేట్రికల్ విడుదల కానున్నట్టుగా ఖరారు అయ్యింది.

సంబంధిత సమాచారం :

More