అక్షయ్ కుమార్ లేటెస్ట్ మూవీ గుడ్ న్యూస్ వసూళ్ల పరంపర మొదలైంది. ఈ శుక్రవారం విడుదలైన గుడ్ న్యూస్ డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజు 17.56 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం రెండవ రోజు శనివారం 21.78 కోట్లు వసూళ్లు సాధించింది. రెండు రోజులకు గాను 39.34 కోట్ల వసూళ్లు సాధించింది. నేడు ఆదివారం కావడంతో వసూళ్లు మరింత మెరుగయ్యే అవకాశం కలదు. మొదటి వారాంతాని ఈచిత్రం 60కోట్లకు పైగా వసూళ్లు రాబట్టే అవకాశం కలదు.
అక్షయ్ కుమార్ కరీనా కపూర్, కియారా అద్వానీ, ధిల్జిత్ దోషాన్త్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ హిందీ జనాలకు బాగానే కనెక్ట్ అయినట్టుంది. కృత్రిమ గర్భధారణ కోసం వచ్చిన ఇద్దరు జంటల విషయంలో జరిగిన మెడికల్ మిస్టేక్ ప్రధానంగా ఈచిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి రాజ్ మెహతా దర్శకత్వం వహించారు.


