ఏడాదికి వందల కోట్లు వెనకేస్తున్న స్టార్ హీరో…!

Published on Jul 11, 2019 8:37 pm IST

ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజిన్ ఈ ఏడాది గాను ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆర్జన కలిగిన సెలబ్రిటీల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో భారత్‌ నుంచి ఒక్క అక్షయ్ కుమార్ మాత్రమే చోటు దక్కించుకున్నాడు. అక్షయ్ ఈ ఘనత సాధించడానికి అసలు కారణం ఆయన విరివిగా సినిమాలు చేయడమే. అక్షయ్ ప్రతి ఏడాది మూడు నుండి నాలుగు చిత్రాలు విడుదల చేస్తారు. ప్రతి సినిమాకు 40కోట్ల పైనే పారితోషకం అందుకుంటూ ఉంటారు. బాలీవుడ్ ఖాన్ త్రయంతో పాటు,రణ్వీర్ సింగ్ వంటి టాప్ స్టార్ కి కూడా ఈ జాబితాలో చోటు దక్కలేదు. జూన్‌ 2018 నుంచి ఈ ఏడాది జూన్‌ వరకూ మొత్తం రూ 444 కోట్ల సంపాదన అక్షయ్‌ కుమార్‌ ఆర్జించినట్లు ఫోర్బ్స్ లెక్కకట్టింది.

అక్షయ్ సినిమాల ద్వారానే కాకుండా అనేక జాతీయ అంతర్జాతీయ బ్రాండ్స్ కి ప్రచార కర్తగా వుంటూ అధిక సంపాదన ఆర్జిస్తున్నారు. . ప్రస్తుతం ఈ స్టార్‌ హీరో 20 ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక సినిమాల పరంగా ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌ నటించిన మిషన్‌ మంగళ్‌ విడుదలకు సిద్ధంగా ఉండగా, హౌస్‌ఫుల్‌ 4, గుడ్‌ న్యూస్‌, లక్ష్మీబాంబ్‌, సూర్యవంశీ చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి.

సంబంధిత సమాచారం :

X
More