సుకుమార్ ‘కుమారి 21ఎఫ్’ హీరోయిన్ మారిందా..?

సుకుమార్ ‘కుమారి 21ఎఫ్’ హీరోయిన్ మారిందా..?

Published on Dec 24, 2014 1:41 AM IST

Heebah-Patel
ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి తొలి ప్రయత్నంగా రూపొందిస్తున్న సినిమా ‘కుమారి 21 ఎఫ్. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే సమకూర్చారు. రాజ్ తరుణ్, షీనా బజాజ్ జంటగా ఈ సినిమా ముహూర్త కార్యక్రమాలు జరిగాయి. తాజాగా దర్శకనిర్మాతలు హీరోయిన్ ను తమ సినిమా నుండి తొలగించారని సమాచారం.

షీనా బజాజ్ స్థానంలో ‘అలా ఎలా?’ ఫేం హేబ్బా పటేల్ ను తీసుకున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ‘అలా ఎలా?’ సినిమాలో హేబ్బా పటేల్ నటన సుకుమార్ & కో ను ఆకట్టుకోవడంతో ఆమెను సెలెక్ట్ చేశారట.

త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ మరియు పీఏ మోషన్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. సుకుమార్, థామస్ రెడ్డి ఆదూరి నిర్మాతలు.

తాజా వార్తలు