“అల వైకుంఠపురములో” రికార్డుల వరద ఇది.!

Published on Nov 25, 2020 7:02 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ల కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం “అల వైకుంఠపురములో” సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఏ కేటగిరీలో కూడా వదలకుండా దుమ్ము దులిపేసిన ఈ చిత్రం లేటెస్ట్ గా ఒక్క రోజులోనే ఒకదాని తర్వాత ఒకటి వరుస రికార్డుల వరదతో ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

ముఖ్యంగా థమన్ సంగీతం అందించిన పాటలు ఒకదాన్ని మించి ఒకటి హిట్టయ్యాయి. అలా వీటిలో హిట్ ట్రాక్స్ బుట్ట బొమ్మ 450 మిలియన్ వ్యూస్ తో సంచలన రికార్డు నెలకొల్పగా అది అలా ఉండగానే రాములో రాముల సాంగ్ లిరికల్ అండ్ ఫుల్ వీడియో సాంగ్ 250 మిలియన్ వ్యూస్ తో సౌత్ ఇండియాలో ఏ హీరోకు ఏ సినిమాకి లేని రికార్డును సెట్ చేసింది.

ఇక ఫైనల్ గా మళ్లీ బుట్ట బొమ్మ సాంగ్ మన దక్షిణాదిలోనే ఫాస్టెస్ట్ 3 మిలియన్ లైక్స్ కొల్లగొట్టి మరో రికార్డు సెట్ చేసింది. ఇలా ఈ కొద్ది లోనే అల వైకుంఠపురములో చిత్రం రికార్డుల వరద కొనసాగించింది.

సంబంధిత సమాచారం :

More