యూఎస్ లో బన్నీ ఫస్ట్, త్రివిక్రమ్ హైయెస్ట్..!

Published on Jan 19, 2020 10:19 am IST

యూఎస్ ప్రేక్షకులను అల వైకుంఠపురంలో మెస్మరైజ్ చేస్తుంది. బన్నీ, త్రివిక్రమ్ మ్యాజిక్ వారిని థియేటర్స్ వైపు పరుగులు పెట్టిస్తుంది. విడుదలై వారం పూర్తి అవుతున్నా, అక్కడ అల వైకుఠపురంలో వసూళ్లు జోరు తగ్గలేదు. ఇక లేటెస్ట్ సమాచారం ప్రకారం అల అలవైకుంఠపురంలో $2.48 మిలియన్ వసూళ్లు సాధించింది. అలాగే $2.5 మిలియన్ వసూళ్లకు చాలా దగ్గరైంది. బన్నీకి ఫస్ట్ $2 మిలియన్ వసూళ్ల చిత్రంగా యూఎస్ లో రికార్డులకెక్కిన ఈ చిత్రం త్రివిక్రమ్ కెరీర్ బెస్ట్ వసూళ్ల వైపుగా దూసుకుపోతుంది. యూఎస్ లో త్రివిక్రమ్ నితిన్ కాంబినేషన్ లో వచ్చిన ‘అ ఆ’ $2.45 మిలియన్ వసూళ్లతో ఆయన హైయెస్ట్ గ్రాస్సింగ్ మూవీగా ఉంది. ఇప్పుడు ఆ రికార్డు చెరిగిపోనుంది.

అల వైకుంఠపురంలో మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ నిర్మించాయి. బన్నీకి జంటగా పూజ హెగ్డే నటించగా, సుశాంత్, నివేదా పేతురాజ్, టబు వంటి వారు కీలక రోల్స్ చేశారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :

X
More