‘ఎఫ్ 3’ టీమ్ కోసం అలీ ప్రత్యేక ‘బిర్యానీ’ !

Published on Jul 11, 2021 5:53 pm IST

టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస సక్సెస్ లతో సూపర్ హిట్స్ కొడుతూ ప్రస్తుతం వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ లతో కలిసి ‘ఎఫ్ 3’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఎఫ్‌ 3 సినిమాలో కమెడియన్‌ అలీ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అయితే, తాజాగా అలీ ఈ సినిమా షూట్ లో పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా ఎఫ్ 3 టీమ్‌ కు ప్రత్యేకంగా మటన్‌ బిర్యానీ చేయించి సెట్ లోని అందరి చేత తినిపించాడు. కాగా అలీ ‘బిర్యానీ’ ఎంతో రుచికరంగా ఉందనే సెన్స్ లో తాజాగా దర్శకుడు అనిల్‌ రావిపూడి తన ఇన్‌ స్టాగ్రామ్‌ లో ‘అలీ గారు ఇంట్లో వండించి తీసుకొచ్చి మాకు వడ్డించారు’ అని పోస్ట్‌ చేశాడు. ఈ మెసేజ్ తో పాటు ఫోటో కూడా పోస్ట్ చేశాడు.

ఇక ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందట. ఈ సాంగ్ లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కనిపించనుందని తెలుస్తోంది. ఇక ఆ మధ్య ఎఫ్ 3 కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే, డబ్బులతో నింపిన ట్రాలీలను నెట్టు కెళుతున్న వెంకటేష్, వరుణ్ లుక్ ఆసక్తి రేపగా… ఇది డబ్బులు చుట్టూ నడిచే కామెడీ డ్రామా అని తెలుస్తోంది. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :