బాలీవుడ్ సినిమా నుంచి వస్తున్న నెక్స్ట్ అవైటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రమే ‘ఆల్ఫా’. స్టార్ బ్యూటీ ఆలియా భట్ ప్రధాన పాత్రలో యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా మొట్టమొదటి ఫీమేల్ స్పై యాక్షన్ సినిమాగా ఇది రాబోతుంది. నిజానికి ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ ఇప్పటికి రిలీజ్ కి సిద్ధం అయ్యింది.
అయితే నిన్న వచ్చిన ఫస్ట్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ ఆ టీజర్ వచ్చిన కొన్ని గంటల్లోనే మేకర్స్ దొరికేసారు. అసలు టీజర్ లో చూపించిన మొదటి సీన్ నే 1990లో వచ్చిన ఓ హాలీవుడ్ చిత్రం ‘లా ఫెమ్మే నికిత’ అనే సినిమా నుంచి కాపీ కొట్టేశారని సోషల్ మీడియాలో నెటిజన్స్ సీన్ టు సీన్ వీడియో మ్యాచ్ చేసి పెట్టేసారు.
అంతే కాకుండా అసలు ఒక బేసిక్ స్పై సినిమాకి ఉండాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోలేదని, ధురంధర్ లో హమ్జా రోల్ తన ఐడెంటిటీ తెలీకుండా ఉండాలని చిన్న ఆనవాలు కూడా లేకుండా చేసుకుంటే ఇందులో డైరెక్ట్ గా పచ్చ బొట్లే వేసుకుంటున్నారని నెటిజన్స్ సోషల్ మీడియాలో ఏకేస్తున్నారు.
దీనితో ఎన్నో కోట్లు పెట్టి తీసినప్పటికీ ఇంకా కాపీ సినిమాలే చేసుకుంటున్నారని నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాబీ డియోల్ కీలక పాత్ర చేస్తుండగా శివ్ రవైల్ దర్శకత్వం వహించారు. అలాగే ఈ జూలై 3న సినిమా గ్రాండ్ గా విడుదలకి రాబోతుంది.
First scene aur wo bhi copy lol #Alpha pic.twitter.com/Cqa0yijK89
— Rajveer. (@RajveerRVSFan) June 10, 2026


