అలియా పూర్తి చేసింది, ఒలీవియా మొదలుపెట్టింది

Published on Nov 28, 2019 11:00 pm IST

ఆర్ ఆర్ ఆర్ విడుదలకు ఇంకా కేవలం ఎనిమిది నెలల సమయం మాత్రమే ఉంది. రాజమౌళి షూటింగ్ విరామం లేకుండా నిర్వహిస్తున్నారు. ఎలాగైనా చెప్పినట్లుగా జులై 30న ఆర్ ఆర్ ఆర్ విడుదల చేయాలని ఆయన భావిస్తున్నారు. కాగా అల్లూరి సీతారామ రాజు పాత్ర చేస్తున్న చరణ్ కి జోడిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం. అలియా భట్ ఆర్ ఆర్ ఆర్ లో తన పార్ట్ పూర్తి చేశారట. దీనితో ఆమె ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి బై చెప్పారని సమాచారం.

ఇక ఇటీవలే లండన్ కి చెందిన స్టేజ్ ఆర్టిస్ట్ ఒలీవియా మోరిస్ ని కొమరం భీమ్ పాత్ర చేస్తున్న ఎన్టీఆర్ కి జంటగా ఎంపిక చేయడం జరిగింది. దీనితో ఎన్టీఆర్, ఒలీవియా మధ్య నడిచే కీలక సన్నివేశాలతో పాటు, పాటల చిత్రీకరణ జరపనున్నారట రాజమౌళి. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. 300కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డి వి వి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండగా, ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :