ఆ లుక్ అంటే ఇంకా భయమేనన్న విజయ్‌ ప్రకాశ్‌.!

Published on Jul 8, 2021 2:06 am IST

తెలుగు, కన్నడ, తమిళ్, మరాఠీ భాషల్లో అనేక పాటలు పాడి తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న ప్రముఖ గాయకుడు విజయ్‌ ప్రకాశ్‌ ఆయన భార్య డబ్బింగ్‌ ఆర్టిస్టు మహతితో కలిసి వచ్చే వారం అలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చి సందడి చేయబోతున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యింది. అయితే వారిద్దరికి అలీ స్వాగతం చెప్పి ఎలా ఉన్నారు అని అడగ్గా అందుకు విజయ్‌ సతీమణి మహతి బాగానే ఉన్నాం ఇప్పటిదాకా అని సమాధానం చెప్పింది. ఇంతలోనే అలీ మీ ఆయన బాగా చూసుకుంటున్నాడా అని అడగ్గా అందుకు మహతి నేనేమి చెప్పుకోవాలి నా కష్టాలు అంటూ చెప్పడంతో కాస్త ఫన్ క్రియేట్ అయ్యింది.

అయితే ఈ సందర్భంగా విజయ్ తన కెరిర్‌లో మొత్తం 5 వేల పాటలు పాడినట్టు చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే దివంగత లెజెండరీ సింగర్ బాల సుబ్రమణ్యాన్ని గుర్తుచేసుకుంటూ ఆయనతో తనకున్న అనుబంధాన్ని చెప్పుకున్నాడు. ఇక విజయ్‌-మహతి వారి ప్రేమ గురుంచి కూడా చెప్పుకొచ్చారు. అయితే తొలిసారి మహతిని చూసినప్పుడు తను ఓ లుక్ ఇచ్చిందని ఆ లుక్ అంటే తనకు ఇంకా భయమని విజయ్ చెప్పడం హిలేరియస్‌గా అనిపించింది. అయితే విజయ్‌-మహతిల మధ్య జరిగిన ఇలాంటి పరిణామాలు, వారి వారి లైఫ్‌లో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి? అనే అంశాలు పూర్తిగా తెలియాలంటే మాత్రం వచ్చే సోమవారం రాత్రి 9:30 గంటలకు ఈటీవీలో ప్రసారమయ్యే అలీతో సరదాగాను చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :