‘ఆర్ఆర్ఆర్’ రీ రిలీజ్ కి సర్వం సిద్ధం

Published on Mar 7, 2023 5:00 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియన్ మూవీ ఆర్ఆర్ఆర్ గత ఏడాది మార్చి 24న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయి ఎంతో పెద్ద విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కొమురం భీంగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించిన ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఎంతో భారీ వ్యయంతో నిర్మించారు. ఇక అటు భారీ కలెక్షన్ రికార్డులు ఇటు ప్రేక్షకాభిమానుల రివార్డులతో పాటు ప్రస్తుతం అనేక అంతర్జాతీయ అవార్డులని సైతం దక్కించుకుంటూ దూసుకెళుతోంది ఈ మూవీ.

ఇక ఇటీవల యుఎస్ఏ లో ప్రత్యేకంగా ప్రదర్శించబడిన ఈ మూవీకి అక్కడి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఇక ఈ మూవీ మార్చి 10న ఇండియా వైడ్ 200 థియేటర్స్ లో రీ రిలీజ్ కి అన్ని ఏర్పాట్లతో సిద్ధం అయింది. అటు యంగ్ టైగర్ ఫ్యాన్స్ తో పాటు ఇటు మెగాపవర్ స్టార్ ఫ్యాన్స్ అలానే నార్మల్ ఆడియన్స్ సైతం మరొక్కసారి ఈ భారీ మూవీని వెండితెరపై చూసేందుకు సంసిద్ధం అవుతున్నారు. కాగా ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ కి నామినేట్ కాగా మార్చి 13న జరుగనున్న ఆ అవార్డుల వేడుక కోసం ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ తో చేరుకోగా త్వరలో ఆర్ఆర్ఆర్ టీమ్ సభ్యులు కూడా యుఎస్ఏ చేరుకుంటున్నారు. మరి ఈ సినిమా ఆస్కార్ ని అందుకుంటుందో లేదో తెలియాలి అంటే మరొక్క వారం ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :