‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సర్వం సిద్ధం

Published on Jun 5, 2023 7:30 pm IST

ప్రభాస్ లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ మైతిలాజికల్ మూవీ ఆదిపురుష్ జూన్ 16న గ్రాండ్ లెవెల్లో పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. ఇందులో ప్రభాస్ రాముడిగా కృతి సనన్ సీతగా అలానే బాలీవుడ్ యాక్టర్ సైఫ్ ఆలీ ఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నారు. ఓం రౌత్ తీస్తున్న ఈ మూవీని రిట్రో ఫైల్స్, టి సిరీస్ ఫిలిమ్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఆదిపురుష్ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, సాంగ్స్, ట్రైలర్ అన్ని కూడా ఎంతో ఆకట్టుకుని ఆడియన్స్ లో మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి.

తాజాగా ఈ మూవీ నుండి రిలీజ్ అయిన రామ్ సీత రామ్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. రేపు ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తిరుపతిలో గ్రాండ్ లెవెల్లో జరుపనుండగా చినజీయర్ స్వామి ప్రత్యేక అతిథిగా విచ్చేస్తున్నారు. ఇప్పటికే భారీ స్థాయిలో ఆ ఈవెంట్ కి ఏర్పాట్లు జరుగుతుండగా, అభిమానులు, సినీ ప్రముఖులు, అతిథులు అందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను పక్కాగా సిద్ధం చేశారట. మరోవైపు ఈ ఈవెంట్ కి టాలీవుడ్ నుండి పలువురు సినీ ప్రముఖులు రానున్నారట. మొత్తంగా అయితే రేపు జరుగనున్న ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమా పై ఆడియన్స్ లో మరింత క్రేజ్ పెంచుతుందని, అలానే రిలీజ్ తరువాత సినిమా కూడా తప్పకుండా భారీ సక్సెస్ అందుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం :