#AALoki అనౌన్స్‌మెంట్‌పైనే అందరి చూపులు.. భారీగా క్రియేట్ అయిన హైప్..!

#AALoki అనౌన్స్‌మెంట్‌పైనే అందరి చూపులు.. భారీగా క్రియేట్ అయిన హైప్..!

Published on Jan 14, 2026 7:00 AM IST

AALoki

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత తెరకెక్కబోయే తన నెక్స్ట్ చిత్రాన్ని ప్రకటించేందుకు బన్నీ రెడీ అయ్యాడు. స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో తెరకెక్కబోయే భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ సంక్రాంతి పండుగ కానుకగా వచ్చేస్తోంది.

ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ అనౌన్స్‌మెంట్‌ను జనవరి 14న చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. #AALoki అనే హ్యాష్ ట్యాగ్‌తో రూపొందనున్న ఈ సినిమా, అనౌన్స్‌మెంట్‌తో ప్రేక్షకుల్లో ఒక్కసారిగా హైప్ నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది. ఇక పండుగపూట ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ అయింది.

ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్‌ను ఎంపిక చేయడంతో అంచనాలు మరింత పెరిగాయి. లోకేష్ కనగరాజ్ సినిమాలకు అనిరుధ్ అందించే పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అల్లు అర్జున్ స్టైల్, ఎనర్జీకి అనిరుధ్ మ్యూజిక్ జత కలిస్తే థియేటర్లలో మాస్ జాతర ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్నారు.

తాజా వార్తలు