జరగండి పైనే అందరి కళ్ళు..

జరగండి పైనే అందరి కళ్ళు..

Published on Mar 27, 2024 7:01 AM IST

గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే ఈరోజు కావున మెగా ఫ్యాన్స్ సహా టాలీవుడ్ ప్రముఖులు కూడా చరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ఇప్పుడు తాను నటిస్తున్న భారీ చిత్రం “గేమ్ ఛేంజర్” ట్రీట్ కోసం అయితే ఇప్పుడు అంతా ఎదురు చూస్తున్నారు. మావెరిక్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో చేస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి మొదటి పాట ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.

ఫైనల్ గా అది చరణ్ బర్త్ డే తో రాబోతుండగా ఇప్పుడు అందరి కళ్ళు ఈ సాంగ్ పైనే పడ్డాయి. రామ్ చరణ్ ప్రెజెన్స్ తో పాటుగా శంకర్ భారీతనాన్ని విట్నెస్ చెయ్యాలని ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరికొన్ని గంటల్లో రానున్న ఈ అవైటెడ్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు