యువ నటుడు ఆనంద్ దేవరకొండ ఇటీవల బేబీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద విజయం సొంతం చేసుకున్నారు. ఇక తాజాగా గం గం గణేశా అనే మూవీ చేస్తున్నారు. దీనిని యువ దర్శకుడు ఉదయ్ బొమ్మిశెట్టి తెరకెక్కిస్తుండగా హైలైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ప్రగతి శ్రీవాస్తవ కథానాయికగా నటిస్తున్న ఈ మూవీలో నయన్ సారిక కీలక పాత్రలో కనిపించనున్నారు.
చైతన్ భరద్వాజ్ స్వరాలు సమకూరుస్తున్న ఈ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన ఒక సాంగ్, టీజర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ లాక్ అయినట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి మే 31న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. కాగా దీనిపై త్వరలో వారి నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.