సోషల్ మీడియాలోకి హీరోలందరూ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు !

Published on Mar 29, 2020 8:30 pm IST

టాలీవుడ్ హీరోల్లో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, చరణ్ నుండి హీరో శర్వానంద్, విశ్వక్ సేన్ దాకా అందరూ సోషల్ మీడియా ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చేశారు. మెగాస్టార్ రాకతో మెగా అభిమానులు ఆనందిస్తున్నారు. పైగా ఇప్పటివరకూ సోషల్ మీడియాకి దూరంగా ఉన్న హీరోలు సైతం ఇలా వరుసపెట్టి ఎంట్రీ ఇచ్చేస్తుడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కాగా తాజాగా శర్వానంద్ కూడా ట్విట్టర్ లో ఎంట్రీ ఇచ్చాడు. పైగా ఎంట్రీ తోనే కరోనా మహమ్మారితో ఇబ్బందులు పడుతున్న తెలుగు సినీ కార్మికుల సంక్షేమం కోసం ‘కరోనా క్రైసిస్ ఛారిటీ’కి 15 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించాడు.

ఇక శర్వానంద్ ప్రస్తుతం ‘శ్రీకారం’ సినిమా చేస్తున్నాడు. డెబ్యూ దర్శకుడు కిశోర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు నిర్మిస్తున్నారు. ఇకపోతే మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 24న విడుదలచేయనున్నారు. ఇందులో శర్వాకు జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తోంది. కాగా శర్వా గత చిత్రం ‘జాను’ ఊహించని రీతిలో ఫ్లాప్ అయింది.

సంబంధిత సమాచారం :

X
More