గోవిందుడు విడుదలకి అన్నీ సిద్దం.!

Published on Sep 30, 2014 5:56 pm IST

GAV-3
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విడుదలకి సంబందించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఓవర్సీస్ మరియు లోకల్ కి వెళ్ళాల్సిన అన్ని ప్రింట్స్ వెళ్ళిపోయాయి. అలాగే అన్ని ప్రాంతాల్లోనూ వేయనున్న ప్రీమియర్ షోస్ కి కూడా పర్మిషన్స్ వచ్చేసాయి. అలాగే చివరి నిమిషం వరకూ డిస్ట్రిబ్యూటర్స్ లేదా ఫైనాన్షియల్ లాంటి సమస్యలు లేకుండా అన్నిటినీ క్లియర్ చేసేసారు.

దీంతో రేపు ప్రతి అచోతా అనుకున్న టైం కి ఈ గోవిందుడు అందరివాడేలే షో పడుతుందని బండ్ల గణేష్ గారే స్వయంగా తెలిపారు. ఇకపోతే ఈ సినిమా మొదటి షో రేపు ఉదయం 5 గంటల 18 నిమిషాలకు పడాలని బండ్ల గణేష్ ముహూర్తం కూడా సెట్ చేసారు.

రామ్ చరణ్ సరసన కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి కృష్ణవంశీ డైరెక్టర్. రామ్ చరణ్ మొదటి సారి చేసిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ లో మెగా అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఉంటాయని ఈ చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

సంబంధిత సమాచారం :