‘మన శంకర వరప్రసాద్ గారు’ గ్రాండ్ ప్రీమియర్స్ కి ఆల్ సెట్!

‘మన శంకర వరప్రసాద్ గారు’ గ్రాండ్ ప్రీమియర్స్ కి ఆల్ సెట్!

Published on Jan 8, 2026 9:04 AM IST

Mana Shankara Vara Prasad Garu

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో వెంకీ మామ కూడా కీలక పాత్రలో నటించిన ఈ సినిమా గ్రాండ్ గా సంక్రాంతి కానుకగా రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఆల్రెడీ కావాల్సినంత బజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు గ్రాండ్ ప్రీమియర్స్ (Mana Shankara Vara Prasad Garu Paid Premiers) కి సిద్ధం అయ్యింది.

ఈ సినిమాకి ముందు రోజే ప్రీమియర్స్ ఉంటాయని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్ గా సినిమా కంటెంట్ ని లాక్ చేసి జనవరి 11 ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ ప్రీమియర్స్ ని వేస్తున్నట్లు అనౌన్స్ చేసేసారు. సో ఇది మెగా అభిమానులకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందించగా సాహు గారపాటి మరియు సుష్మిత కొణిదెల నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు