గ్లోబల్ స్టార్ 16 గ్రాండ్ లాంచ్ కి సర్వం సిద్ధం.!

గ్లోబల్ స్టార్ 16 గ్రాండ్ లాంచ్ కి సర్వం సిద్ధం.!

Published on Mar 19, 2024 10:01 AM IST


టాలీవుడ్ నుంచి మెగాపవర్ స్టార్ స్థాయి నుంచి గ్లోబల్ మెగాపవర్ స్టార్ గా ఎదిగిన హీరో రామ్ చరణ్ (RamCharan). తన లాస్ట్ సెన్సేషనల్ హిట్ చిత్రం RRR తో ఖండాంతరారలో అపారమైన క్రేజ్ ని సొంతం చేసుకున్న రామ్ చరణ్ హీరోగా తన కెరీర్ 16 (RC16) వ సినిమాని అయితే దర్శకుడు బుచ్చిబాబు సానా తో చేయనున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా చరణ్ పుట్టినరోజుకి ఒక వారం ముందే గ్రాండ్ గా లాంచ్ చేస్తున్నట్టుగా మేకర్స్ కూడా ఫిక్స్ చేశారు.

మరి ఈ గ్రాండ్ లాంచ్ కి అయితే ఇప్పుడు సర్వం సిద్ధం అయ్యినట్టుగా తెలుస్తుంది. ఈ మార్చ్ 20న సినిమా గ్రాండ్ గా హైదరాబాద్ లో చిత్రం టోటల్ యూనిట్ సహా పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో లాంఛనంగా ఆరంభం కానుంది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తుండగా లెజెండరీ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే వృద్ధి సినిమాస్ మరియు మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. మరి బుచ్చిబాబు అయితే ఈ చిత్రానికి గ్లోబల్ రీచ్ ఉండే సబ్జెక్టుని ని రెడీ చేసాడట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు