వైభవంగా జగపతి బాబు కూతురి పెళ్ళి

వైభవంగా జగపతి బాబు కూతురి పెళ్ళి

Published on Mar 9, 2015 10:45 AM IST

jagapathi-babu
ప్రముఖ నటుడు జగపతి బాబు పెద్ద కుమార్తె మేఘన వివాహ వేడుక నిన్న (ఆదివారం) రాత్రి హైద్రాబాద్‌లోని వెస్టిన్ హోటల్లో జరిగింది. పూర్తి ప్రైవేట్ కార్యక్రమంగా ఈ వేడుకను నిర్వహించినట్టు సమాచారం. వరుడు ఎన్నారైగా తెలియ వస్తోంది. వేడుకకు సంబంధించిన పూర్తి విషయాలను కొద్ది సమయం తర్వాత విడుదల చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అంతకుముందు గురువారం రోజున సంగీత్ వేడుకను నిర్వహించారు.

తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన జగపతి బాబు, ఈ మధ్య కాలంలో పూర్తిగా క్యారక్టర్ పాత్రలకు పరిమితమయ్యారు. ప్రస్తుతం.. మహేశ్, ఎన్టీఆర్ సినిమాల్లో ఆయన కీలక పాత్రలను పోషిస్తున్నారు. 53 ఏళ్ళ ఈ ఎనర్జిటిక్ నటుడు సంగీత్ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు