“జల్సా” పవర్ బ్లాస్ట్ కి కూడా ఆల్ మోస్ట్ అంతా సిద్ధం.!

Published on Aug 11, 2022 7:01 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో భారీ హిట్ చిత్రాల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేసినటువంటి చిత్రం “జల్సా” కూడా ఒకటి. మరి పవన్ కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా ఒక బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ చిత్రంని ఈ ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అప్ గ్రేడ్ చేసిన కొత్త ప్రింట్ తో షో కావాలని పవన్ ఫ్యాన్స్ డిమాండ్ చెయ్యగా సినిమా నిర్మాతలు మెగా కాంపౌండ్ కూడా ఈ సినిమా పనుల్లో చాలా బిజీగా ఉన్నారు.

మరి ఇదిలా ఉండగా ఈ అవైటెడ్ సినిమా అయితే కొత్త ప్రింట్ కి మార్చడం ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయ్యిపోయింది అని, ఇప్పుడు టెస్టింగ్ సహా డాల్బీ సౌండ్ టెస్టింగ్ లో కూడా ఉన్నట్టుగా వారు చెబుతున్నారు. మరి దీనితో అయితే ఈ సెప్టెంబర్ 2న మాత్రం థియేటర్స్ లో పవర్ స్టార్ బ్లాస్ట్ గట్టిగానే ఉంటుందని చెప్పాలి. ఇక ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించగా దేవిశ్రీ ప్రసాద్ ట్రెండ్ సెట్టింగ్ ఆల్బమ్ ని అందించాడు. అలాగే గీతా ఆర్ట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :