‘రుద్రమదేవి’ బెనిఫిట్ షోకి అంతా సిద్ధం!

‘రుద్రమదేవి’ బెనిఫిట్ షోకి అంతా సిద్ధం!

Published on Oct 8, 2015 8:23 PM IST

Rudhramadevi
తెలుగు సినీ అభిమాను ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుద్రమదేవి సినిమా మరో కొద్ది గంటల్లో ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్ల ముందు వాలిపోనుంది. గుణశేఖర్ కలల ప్రాజెక్ట్‌గా రూపొందిన ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో రేపు భారీ ఎత్తున విడుదల కానుంది. ఇక అన్నిచోట్ల కంటే ముందర హైద్రాబాద్‌లోని శ్రీ రాములు థియేటర్లో రుద్రమదేవి స్పెషల్ బెనిఫిట్ షో ప్రదర్శితం కానుంది. ఈ బెనిఫిట్ షోకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి.

దర్శకుడు గుణశేఖర్, ప్రముఖ నిర్మాత దిల్‌రాజులతో పాటు పలువురు ఇతర టాలీవుడ్ స్టార్స్ ఈ షోకు విచ్చేయనున్నారు. రాత్రి 1 గంటకు రుద్రమదేవి బెనిఫిట్ షో ప్రారంభం కానుంది. ఇక ఈ షోకు సంబంధించి, సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు 123తెలుగులో అందించే ప్రయత్నం చేస్తున్నాం. అనుష్క, అల్లు అర్జున్, రానా, నిత్యా మీనన్, కృష్ణం రాజు, ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం సమకూర్చారు. భారతదేశపు మొట్టమొదటి 3డీ బయోపిక్‌గా రూపొందిన ఈ సినిమా 2డీ, 3డీ రెండు వర్షన్స్‌లో విడుదల కానుంది.

తాజా వార్తలు