ఎట్టకేలకు చైనాలో దిగుతున్న రజని.

Published on Aug 13, 2019 4:07 pm IST

దర్శకుడు శంకర్, రజని కాంబినేషన్ లో రోబోకి కొనసాగింపుగా వచ్చిన భారీ చిత్రం “2.0”. ఈమూవీ చైనా విడుదలకు రంగం సిద్ధమైంది. వచ్చేన నెల 6న రజని ‘2.0’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు అధికారంగా ప్రకటించారు. నిజానికి ఈ చిత్రం జులై 12న విడుదల చేయాలని భావించారు. ఐతే అదే తేదీలలో ప్రఖ్యాత వాల్ట్ డిస్నీ నిర్మించిన “ది లయన్ కింగ్” మూవీ విడుదల ఉన్న నేపథ్యంలో వాయిదా వేయడం జరిగింది. తాజాగా విడుదలకు సంబంధించి అన్ని ఆటంకాలు తొలగిపోవడంతో సెప్టెంబర్ 6న విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది.

ఇక 450కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ‘2.0’ చిత్రం భారత్ లో మంచి వసూళ్లనే రాబట్టింది. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రతినాయకుడుగా కనిపించగా, అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించింది. ఈ భారీ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. గతంలో విడుదలైన రోబో చిత్రం చైనాలో మంచి ఆదరణ దక్కించుకోవడంతో ఈ మూవీపై అంచలనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :