డిసెంబర్ 27న వస్తున్న ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’.

Published on Dec 8, 2019 4:27 pm IST

సంజయ్ ఇదామ, శ్రీనాధ్ మాగంటి, అహల్య సురేష్, ప్రియ హీరో హీరోయిన్లుగా రాహుల్ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన చిత్రం ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’. జె కరుణ కుమార్ సోషల్ మెస్సేజ్ తో కూడిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నిన్న ఈ మూవీ ఆడియో లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. జీవిత రాజశేజర్ దంపతులు, మల్కాపురం శివకుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సంధర్భంగా పిల్లలకు ఒత్తిడితో కూడిన చదువుల వలన ప్రయోజనం ఉండదని, వారిలో ఉన్న నైపుణ్యాన్ని గ్రహించి ఆ దిశగా వారిని ప్రోత్సహించాలని, అందరూ డాక్టర్స్ ఇంజనీర్స్ ఐ పి ఎస్ లు కావాల్సిన పనిలేదని జీవిత దంపతులు చెప్పుకొచ్చారు. ఒత్తిడితో కూడిన చదువులు ఎందరో విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నాయనే మంచి కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం విజయం సాధిస్తుందని వారు చిత్ర నిర్మాతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నటీనటులు మరియు దర్శక నిర్మాతలు చిత్ర విశేషాలు పంచుకున్నారు. స్టూడెంట్ అఫ్ ది ఇయర్ ఈనెల 27న విడుదల కానుంది. ఈ మూవీకి సంగీతం యాజమాన్య అందించారు. బి ఓబుల్ రెడ్డి సుబ్బారెడ్డి నిర్మాతగా మొదటి చిత్రం నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More