అక్టోబర్ 22కు ఫిక్స్ అయిపోయిన ‘అఖిల్’..!

అక్టోబర్ 22కు ఫిక్స్ అయిపోయిన ‘అఖిల్’..!

Published on Oct 13, 2015 12:34 AM IST

akhil
‘అఖిల్’.. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ట్రెండ్ అయిపోయిన పేరు. అక్కినేని వంశం నుంచి మూడో తరంలో ఎంట్రీ ఇస్తోన్న అఖిల్, తన మొదటి సినిమాకు కూడా అదే పేరుని ఫిక్స్ చేసుకొని వస్తూండడంతో అఖిల్ అన్న పేరు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయింది. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ తెరకెక్కించిన ‘అఖిల్’ సినిమా దసరా కానుకగా పెద్ద ఎత్తున విడుదల కానుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను దాదాపుగా చివరిదశకు చేర్చిన సినిమా యూనిట్ అక్టోబర్ 22నే సినిమా విడుదల కానుందన్న విషయాన్ని స్పష్టం చేసేసింది.

ఇక అక్టోబర్ 16న ఈ సినిమాను సెన్సార్ కార్యక్రమాలకు పంపనున్నారు. సినిమా రిలీజ్‌కు ఇంకా పది రోజులే సమయం ఉండడంతో సినిమా యూనిట్ ప్రచార కార్యక్రమాలను మరింత వేగవంతం చేసింది. ఈ సినిమాకు నిర్మాత అయిన హీరో నితిన్, అక్కినేని వంశం నుంచి హీరో ఎంట్రీ అంటే ఉండే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీత దర్శకత్వం వహించగా, అఖిల్ సరసన సయేషా సైగల్ హీరోయిన్‌గా నటించారు.

తాజా వార్తలు