దసరా సెలవులను బాగానే ఉపయోగించుకున్నఆ 3 సినిమాలు !

Published on Oct 22, 2018 10:14 am IST

ఈ దసరాకు మూడు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. వాటిలో మొదటగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’. మంచి మౌత్ టాక్ తో పాటు దసరా సెలవులు కూడా కలిసిరావడంతో ఈ చిత్రం ఎన్టీఆర్ కేరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ ను రాబట్టి సంచలన విజయాన్ని నమోదుచేసింది.

ఇకఈ సినిమాకు వారం రోజుల గ్యాప్ తో రామ్ నటించిన ‘హలో గురు ప్రేమ కోసమే’ అలాగే తమిళ హీరో విశాల్ నటించిన అనువాద చిత్రం ‘పందెం కోడి 2’ విడుదలై యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్న దసరా సెలవుల వల్ల మంచి కలెక్షన్స్ ను సాధించాయి. హలో గురు.. మూడు రోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.10కోట్ల షేర్ వసూళ్లు సాధించి రామ్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టగా పందెంకోడి రూ. 4కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి విశాల్ కు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను అందించింది.

సంబంధిత సమాచారం :