పోలీసుల అరాచకాలను బయటపెడతాడట

పోలీసుల అరాచకాలను బయటపెడతాడట

Published on Jul 9, 2020 2:21 AM IST


కామెడీ హీరోగా ఓ స్పెషల్ ఇమేజ్ సెట్ చేసుకున్న అల్లరి నరేష్…సీరియస్ రోల్ ఎంచుకున్నాడు. గతంలో నేను,ప్రాణం, విశాఖ ఎక్సప్రెస్ వంటి చిత్రాలలో సీరియల్ రోల్స్ చేసిన అల్లరి నరేష్ నాంది చిత్రంలో మరో సారి టై చేస్తున్నారు. అల్లరి నరేష్ పుట్టిన రోజు కానుకగా ఈ మూవీ నుండి టీజర్ రాగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. చిత్రీకరణ చివరి దశకు చేరిన ఈ మూవీ ఓ సీరియస్ సబ్జెక్టును టచ్ చేస్తూ తెరకెక్కింది.

కాగా ఈ సినిమా గురించి అల్లరి నరేష్ మాట్లాడుతూ కస్టడీలో ఉన్న ముద్దాయిలు, నిందితులు మరియు అమాయకుల పట్ల పోలీసుల అరాచకాలు తెలియజేసేదిగా నాంది మూవీ ఉంటుందట. ఈ మధ్య తమిళనాడులో జరిగిన లాకప్ డెత్ ల నేపథ్యంలో సమకాలీన పరిస్థితులను ప్రతిబించేదిగా ఈ కథ ఉంటుందని ఆయన తెలియజేశారు. డెబ్యూ డైరెక్టర్ విజయ్ కనకమేడల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు