అయోమయ స్థితిలో పడ్డ అల్లరి నరేష్

అయోమయ స్థితిలో పడ్డ అల్లరి నరేష్

Published on Jun 22, 2014 10:51 PM IST

allari-naresh
కామెడీ కింగ్ అల్లరి నరేష్, ఈ పేరు వింటే తెలుగు ప్రేక్షకులు కామెడీకి కేరాఫ్ అడ్రెస్ అని చెబుతారు. గతంలో అల్లరి నరేష్ బాక్స్ ఆఫీసు వద్ద తమ సినిమాలతో మోస్ట్ డిపెండెంట్ హీరో అనిపించుకున్నాడు. అల్లరి నరేష్ సినిమాలన్నిటికీ మినిమమ్ గ్యారంటీ ఆఫర్స్ వచ్చేవి అలాగే డిస్ట్రిబ్యూటర్స్ కూడా నష్టపోయేది చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది.

ఎందుకంటే తను నటించిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద పరజయాలనే చవిచూస్తున్నాయి. నరేష్ నటించిన ‘జంప్ జిలాని’ కూడా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో డీలా పడిపోయిన అల్లరి నరేష్ ప్రస్తుతం అయోమయ స్థితిలో ఉన్నాడు. అలాగే ప్రేక్షకులు తన నుంచి ఇలాంటి కామెడీ ఆశించడం లేదని అర్థమైంది.

ఈ మధ్యలో నరేష్ ‘లడ్డూబాబు’ లాంటి డిఫరెంట్ సినిమా ట్రై చేసినప్పటికీ అది కూడా ఫ్లాప్ గానే నిలిచింది. దీని ప్రకారం నరేష్ నెక్స్ట్ గోల్ ఏంటి? బాక్స్ ఆఫీసు వడ్డా తన మార్క్ ని మార్చుకోవడానికి ఎం చేయబోతున్నాడు? అనే విషయాలపై ప్రస్తుతం అల్లరి నరేష్ దృష్టి సారించాడు.

తాజా వార్తలు