క్రేజ్ లేకుండా వస్తున్న అల్లరి నరేష్ ‘జంప్ జిలాని’

క్రేజ్ లేకుండా వస్తున్న అల్లరి నరేష్ ‘జంప్ జిలాని’

Published on Jun 11, 2014 12:37 PM IST

jump-jillani
మామూలుగా ప్రతి శుక్రవారం బాక్స్ ఆఫీసు వద్ద ఏదో ఒక సినిమా సందడి చేస్తూ ఉంటుంది. కానీ ఈ వారం ఒక రోజు ముందే అనగా రేపు అల్లరి నరేష్ నటించిన ‘జంప్ జిలాని’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రేపు రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి సరైన పబ్లిసిటీ లేదు, అలాగే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై క్రేజ్ ని కూడా ఈ చిత్ర ప్రొడక్షన్ టీం కలుగజేయలేకపోయింది. దాంతో ఈ సినిమా లెస్ క్రేజ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

మొట్టమొదటి సారి అల్లరి నరేష్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్న ఈ సినిమాలో ఇషా చావ్లా, స్వాతి దీక్షిత్ హీరోయిన్స్ గా నటించారు. తమిళంలో హిట్ అయిన ‘కలగలప్పు’ సినిమాకి ఇది రీమేక్. ఇ. సత్తిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాని అంబికా కృష్ణ మరియు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ వారు కలిసి నిర్మించారు. మరి ఇంత తక్కువ క్రేజ్ తో వస్తున్న ఈ సినిమా రేపు బాక్స్ ఆఫీసు వద్ద విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి..

తాజా వార్తలు